calender_icon.png 20 March, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీటికి 23,373 కోట్లు

20-03-2025 02:24:08 AM

గతేడాదితో పోలిస్తే స్వలంగా పెరుగుదల

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్రానికి కీలకమైన సాగునీటి రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు స్వల్పంగా దక్కాయి. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ.23,373 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే (రూ.22,301 కోట్లు) కేవలం రూ.1072 కోట్లు మాత్రమే అధికం కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పురోగతి దశలో ఉంది. రాష్ర్టంలో దాదాపు 3ం ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల కొత్తగా ప్రారంభమైన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఈ తరుణంలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఏ మేరకు సరిపోతాయన్నది కీలకంగా మారింది. 

ఆర్థిక సంవత్సరం    కేటాయింపులు (కోట్లలో)

2022-23               రూ.19,383

2023-24 రూ. 26,885

2024-25 రూ. 22,301

2025-26 రూ. 23,373