calender_icon.png 18 November, 2024 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా మహిళాశక్తి భవనాలకు రూ.110 కోట్లు

18-11-2024 01:43:18 AM

  1. ఉత్వర్వులు జారీ చేసిన సర్కారు 
  2. ఒక్కో భవనానికి రూ.5కోట్ల అంచనా
  3. 22 జిల్లా కేంద్రాల్లో నిర్మాణానికి శ్రీకారం

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్మి స్తున్న ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అను మతులిచ్చింది. ఈమేరకు ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రా ల్లో మహిళాశక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ.5కోట్లతో మొత్తంగా రూ.110 కోట్ల అం చనా వేసింది. నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 

నేడు మండల సమాఖ్యల ప్రత్యేక సమావేశం..

ఈనెల 19వ తేదీన విజయోత్సవ సభ మహిళా సాధికారత థీమ్‌తో నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం అన్ని మండలాల్లో మండల సమాఖ్యల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఇందిరా మహిళాశక్తి సంబురాలు నిర్వహించాలని తీర్మానించనున్నారు.

ప్రధానంగా సంఘంలో లేని వారిని సంఘాల్లో చేర్పించడం, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం, ఋణ బీమా, ప్రమాద బీమా పథకం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫాంల తయారీ, డ్వాక్రా బజార్ ఏర్పాటు, బ్యాంకు లింకేజీ కార్యక్రమం, వడ్డీ లేని ఋణాలు, ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం వంటి ఎంజెడా అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

శక్తి భవనాలునిర్మించే జిల్లాలు ఇవే..

మేడ్చల్ మల్కాజ్‌గిరి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, నారాయణపేట్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, మెదక్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, నిర్మల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల్.