calender_icon.png 20 September, 2024 | 1:56 PM

121 కోట్లతో ఉస్మానియాలో హాస్టల్ బిల్డింగ్స్

07-09-2024 12:00:00 AM

త్వరలోనే మరిన్ని ల్యాబ్ టెక్నీషియన్ల భర్తీ

మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): వైద్య విద్యార్థుల కోసం కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో కొత్తగా నిర్మించనున్న బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ భవనాలకు శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ‘వైద్యో నారాయణ హరి’ అన్నట్లుగా వైద్యులు దేవుళ్లతో సమానంగా గౌరవింపబడతారన్నారు. హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం రూ. 121 కోట్లతో కొత్త భవనాల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.

కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఇటీవల నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్లకు మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న 285 ల్యాబ్ టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే మరో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని, వాటి భర్తీ ప్రక్రియ త్వరలోనే ఉంటుందని మంత్రి అన్నారు. 

మట్టి విగ్రహాలను పూజించాలి: పొన్నం 

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని  మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసి మాట్లాడారు.