ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
హైదరాబాద్, అక్టోబర్ 14(విజయక్రాంతి): ఎన్‌హెచ్ 565లోని నకిరేకల్-నాగార్జున సాగర్ మధ్య హైవే నిర్మాణానికి కేంద్రం సోమవారం రూ.516కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నిధులతో మొత్తం 18 కిలో మీటర్ల రహదారిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందులో నాలుగు కిలోమీటర్ల మేరకు బైపాస్ ఉంటుందని వివరించారు.
ఎన్‌హెచ్ 565 అనేది తెలంగాణ కలిపే కీలకమైన రహదారి. ఇది తెలంగాణలోని ఎన్‌హెచ్ 65 జంక్షన్ వద్ద ప్రారంభమై నల్లగొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా వెళుతుంది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ట్రాఫిక్ తగ్గడంతో పాటు నకిరేకల్ నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీ కూడా మెరుగుపడుతుందని గడ్కరీ పేర్కొన్నారు.