calender_icon.png 4 November, 2024 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలహాకు 100 కోట్లు

03-11-2024 01:53:55 AM

నా దగ్గర డబ్బులు లేవనే వార్తలు అవాస్తవం: పీకే

పాట్నా(బీహార్), నవంబర్ 2: రాజకీయ నేతగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో జనసురాజ్ పార్టీని స్థాపించి రాష్ట్రంలోని ౪ అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టా రు. శనివారం బెలగంజ్‌లో నిర్వహించిన ప్రచారంలో పీకే మాట్లాడుతూ.. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. తనది కొత్త పార్టీ కావచ్చు కానీ నిధుల సమస్య లేదని స్పష్టంచేశారు. తాను వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో పార్టీకి సలహాలిస్తే రూ.100కోట్లు వరకు తీసుకుంటానని పీకే వెల్లడించారు.