calender_icon.png 11 October, 2024 | 5:05 AM

సైబర్ బాధితులకు 1.09 కోట్లు అందజేత

11-09-2024 03:05:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సైబర్ మోసగాళ్ల వలలో పడి డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైమ్ పోలీసులు డబ్బు రీకవరీ చేసిఇచ్చారు. బేగంపేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి(52)కి ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చంటూ సుమారు రూ.1.22 కోట్లు పెట్టుబడులుగా పెట్టించారు. మరో ఘటనలో నగరానికి చెందిన వ్యక్తి(62)కి గోల్డ్‌మెన్ సచ్స్ సెక్యూరిటీస్‌లో పెట్టుబడుల పేరుతో రూ.32 లక్షలను పెట్టుబడులుగా పెట్టించారు. అనంతరం స్కామర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎన్‌సీఆర్‌పీ (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) సహాయంతో బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి డబ్బును సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేయించారు. అనంతరం కోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం బాధితులకు రూ. 1.09 కోట్లను చెల్లించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.