వాషింగ్టన్: దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ’గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.