calender_icon.png 16 November, 2024 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 వేల కోట్ల స్విగ్గీ ఐపీవో 6న ప్రారంభం

04-11-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, నవంబర్ 3: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న స్విగ్గీ భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 6, బుధవారం ప్రారంభం కానుంది. స్విగ్గీతో పాటు ఈ వారం మరో మూడు మెయిన్‌బోర్డ్ ఐపీవోలు మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. రూ. 22,327 కోట్లకు స్విగ్గీ జారీచేస్తున్న ఆఫర్లో షేరుకు రూ.371-390 ప్రైస్‌బ్యాండ్‌గా నిర్ణయించారు.

ఆఫర్ నవంబర్ 8న ముగుస్తుంది. ఈ ఐపీవోలో రూ.4,499 కోట్ల విలువైన 11.54 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను స్విగ్గీ జారీచేస్తుండగా, మరో రూ. 6,828 కోట్ల విలువైన 17.51 కోట్ల షేర్లను ప్రస్తుత షేర్‌హోల్డర్లయిన పలు విదేశీ ఈక్విటీ ఫండ్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయిస్తాయి.

5న సాగిలిటీ ఇండియా ఆఫర్ 

హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్‌లు, మెడికల్ టెక్నాలజీ సంస్థలు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు హెల్త్‌కేర్ ఫోకస్డ్ సొల్యూషన్స్, సర్వీసుల్ని అందించే సాగిలిటీ ఇండియా ఐపీవో నవంబర్ 5న ప్రారంభమై 7న ముగుస్తుంది. రూ.2,106 కోట్ల సమీకరణకు వస్తున్న ఈ ఐపీవో ప్రైస్‌బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 28-30గా నిర్ణయించారు. ఐపీవోలో సాగిలిటీ ఇండియా ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు. ఈ కంపెనీ మాతృసంస్థ నెదర్లాండ్స్‌కు చెందిన సాగిలిటీ బీవీ 70.22 కోట్ల ఈక్విటీ షేర్లను ఓఎఫ్‌ఎస్ రూట్లో విక్రయిస్తుంది. 

6న ఆక్మే సోలార్ హోల్డింగ్స్ ఆఫర్ 

సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ఆక్మే సోలార్ హోల్డింగ్స్ రూ. 2,900 కోట్ల సేకరణకు జారీచేస్తున్న పబ్లిక్ ఆఫర్ ఈ నెల 6న మొదలై 8న ముగుస్తుం ది. ఆఫర్లో షేరుకు రూ.275-289 ప్రైస్‌బ్యాండ్‌గా నిర్ణయించారు.  రూ. 2,395 కోట్ల విలువైన 8.29 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల ను కంపెనీ జారీచేస్తుండగా,  రూ.505 కోట్ల విలువైన 1.75 కోట్ల షేర్లను ఓఎఫ్‌ఎస్ మా ర్గంలో ప్రస్తుత షేర్‌హోల్డర్లు విక్రయిస్తారు.