జబల్‌పూర్, జూలై 11: నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి ఫీ జులు వసూలు చేసినందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి ంది. అక్రమంగా వసూలు చేసిన రూ. 65 కోట్లు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. జబల్‌పూర్‌లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికం గా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు. 2018 నుంచి 2024 మధ్య 10 విద్యాస ంస్థలు సుమారు 81 వేల విద్యార్థుల నుంచి రూ.64.58 కోట్ల మేర అక్రమంగా వ సూలు చేసినట్లు విచారణ అధికారు లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మొత్తాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించా లని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. యాజమాన్యాలు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఫీజులు పెంచాయి.