07-02-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, ఫిబ్రవరి 6: చేవెళ్ల నియోజకవ ర్గానికి రూ.10.40 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గంలోని 5 మండలాలకు సీఆర్ ఆర్ లోని ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఈ నిధులు మంజూ రయ్యాయని వెల్లడించారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించ నున్నట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు చేవెళ్ల, మొయినాబాద్ మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ. 11.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేని పేదలకు ప్రభుత్వం సీఎంఆర్ ఎఫ్ కింద సాయం చేస్తోందని, అర్హులు వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, టీపీసీసీ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాములు, బండారి ఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.