ప్రకటన విడుదల చేసిన యూపీ ప్రభుత్వం
ప్రయాగ్‌రాజ్, జనవరి 23: ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 10 కోట్లకుపైగా భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గురవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 30లక్షల మంది పవిత్రస్నానాలు చేసినట్టు వెల్లడించింది.
దీంతో మహాకుంభమేళాలో పాల్గొన్న భక్తుల సంఖ్య 10కోట్లకు చేరినట్టు వివరించింది. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా భక్తులతో కళకళలాడుతోంది. ఈ వేడుకకు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తును భక్తులు తరలివస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మొత్తం 4౦ రోజులపాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సుమారు 45 కోట్లకుపైగా భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.