calender_icon.png 17 January, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,500కోట్ల ప్యాకేజీ

17-01-2025 02:03:21 AM

నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్న కేంద్ర మంత్రి కుమారస్వామి

న్యూఢిల్లీ, జనవరి 16: వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై గురువారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు భారీగా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,500కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి శుక్రవారం వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కాగా నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యే క ప్యాకేజీని అందించేందుకు సిద్ధమైంది.