calender_icon.png 16 November, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌సీసీకి రూ.3,496 కోట్ల ఆర్డర్లు

03-11-2024 11:51:14 PM

హైదరాబాద్, నవంబర్ 3: ఈ ఏడాది అక్టోబర్ నెలలో రూ. 3,496 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్‌సీసీ వెల్లడిం చింది. ఇందులో రూ. 2,684 కోట్ల ఆర్డర్లు తమ బిల్డింగ్ డివిజన్ సంపాదించిందని, రూ.538 కోట్లు ఎలక్ట్రికల్ డివిజన్, మరో రూ.274 కోట్లు వాటర్, ఇతర డివిజన్లకు సంబంధించిన ఆర్డర్లని ఎన్‌సీసీ వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల నుంచి వచ్చాయని, అంతర్గత ఆర్డర్లేవీ లేవని తెలిపింది.