calender_icon.png 11 October, 2024 | 1:54 PM

ఎన్‌సీసీకి రూ.2,727 కోట్ల ఆర్డర్లు

02-10-2024 12:00:00 AM

హైదరాబాద్, అక్టోబర్ 1: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.2,327 కోట్ల విలువైన (జీఎస్టీని మినహాయించి) ఆర్డర్లు సంపాదించింది. ఇందులో రూ. 1,417 కోట్ల ఆర్డర్లు తమ ట్రాన్స్‌పోర్ట్ డివిజన్‌కు చెందినవని, ఎలక్ట్రికల్ డివిజన్‌కు రూ.520 కోట్ల ఆర్డర్లు లభించాయని, మరో రూ.390 కోట్ల ఆర్డర్లు బిల్డింగ్ డివిజన్‌కు వచ్చాయని ఎన్‌సీసీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.