calender_icon.png 28 September, 2024 | 4:49 PM

2.25 కోట్ల గంజాయి పట్టివేత

26-09-2024 03:03:07 AM

అంతర్రాష్ర్ట ముఠా అరెస్టు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాం తి): ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం రా త్రి రూ.2.25 కోట్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తలమడుగు పోలీస్ స్టేషన్ లో బుధవారం మీడియా సమావేశంలో ఎస్పీ గౌష్ ఆలం వివరాలు వెల్లడించారు.

ఆ ంధ్ర సరిహద్దులోని అటవీ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ మీదుగా మహారాష్ర్టకు గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని తెలంగాణ సరిహద్దులోని తలమడు గు మండలం లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 2.25 కోట్ల వి లువైన 900 కిలోల గంజాయిని సాధీనం చేసుకున్నారు.

దేశంలోని వివి ధ రాష్ట్రాలకు చెందిన నిందితులు ఆశిష్, పండిత్ జి, వసీం అన్సారి, అర్మాన్, అను జైన్, సోను అన్సా రీ, వాహన డ్రైవర్ వసీమ్, క్లీనర్ అర్మాన్‌ల తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ముఠా సభ్యులను అరె స్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీ సు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 

12.82కిలోల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మ ణుగూరు మండలం రదం గుట్ట  అర్బన్ పా ర్కు వద్ద 12.85 కిలోల గంజాయిని పోలీసు లు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మహాబూబాబాద్, జనగా మ జిల్లాలకు చెందిన నలుగురు ద్విచక్ర వా హనంపై 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీలేరుకు చేరుకున్నారు.

అక్కడ ఒడిశా నుం చి 12.82 కిలోల గంజాయిని కొని, మహబూబాబాద్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. జనగామకు చెందిన సంపత్, నందమాల లవకుమార్, మహబూబాబాద్‌కు చెందిన బందేల్ సాయికుమార్, బోడ వంశీలను అరెస్టు చేశారు. వారి నుంచి గంజాయి తో పాటు రెండు ద్విచక్రవాహనాలు స్వా ధీనం చేసుకున్నారు. 

వరద బాధితులకు సర్టిఫికెట్ల జారీ

ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ 

ఖమ్మం, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వరద బాధితులు కోల్పోయిన వివిధ రకాల సర్టిఫికెట్ల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ పి శ్రీజ  తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. సర్వే ఆధారంగా ఇప్పటివరకు పదో తరగతి సర్టిఫికెట్ల కోసం 680 మంది, ఇంటర్ డిగ్రీ/బీటెక్ పీజీ పాస్‌పోర్ట్ కోసం 29 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.

అలాగే రెవెన్యూకు సంబంధించి ఆదాయ సర్టిఫికెట్ల కోసం 269, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం 189, ఓబీసీ సర్టిఫికెట్ల కోసం 77, పాస్ పుస్తకాల కోసం 88, ఆధార్ రేషన్ కార్డుల కోసం 182 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. రెండు, మూడు వారాల్లో బాధితులకు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.