- 773 చెరువులు, కాల్వలకు గండ్లు
- నష్టంపై కేంద్రానికి నివేదిక పంపాం
- యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు
- వారంలోగా కాల్వలకు నీటి విడుదల
- ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 15: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన ప్రకృతి విపత్తు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10.300 కోట్లు నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. నష్టం వివరాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని, సాయం కోరామన్నారు. అయితే కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా నష్ట నివారణ చర్యలు పట్టామన్నారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో ఆదివారం ఆయన పర్యటించారు.
నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం సమీపంలో సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు 132 కిలోమీటర్ వద్ద పడిన గండి , హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌కు పడిన గండి, చిలుకూరు మండలం ఆర్లెగూడెం సమీపం లో రెడ్లకుంట మేజర్‌కు పడిన గండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నష్టపోకూడదన్న సం కల్పంతోనే తెగిన కాల్వకట్టలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు.
వర్షాల కారణంగా ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం వాటిల్లిందన్నారు. కాగిత రామచంద్రాపురం వద్ద పడిన గండిని వేగవంతంగా పూడ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాత్రింబవళ్లు పని చేసి వారంలోగా కాల్వకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే రాత్రివేళ పనులు జరిగేందుకు ఫ్లడ్‌లైట్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని అన్నారు. విపత్తు సంభవించిన నాటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్కలతో సహా అందరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామన్నారు.
ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు..
అనంతరం హుజూర్‌నగర్‌లో జరుగుతు న్న ముత్యాలమ్మ జాతరలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. వచ్చే నెల 27న జరిగే మహా రుద్రాభిషేకంకు సంబంధించిన వాల్‌పోస్టర్‌లు, కరప త్రాలను ఆవిష్కరించారు. మంత్రి వెంట కలెక్టర్ తేజస్, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.
773 చెరువులు, కాల్వలకు గండ్లు..
రాష్ట్రవ్యాప్తంగా 773 చెరువులు, కాల్వలకు గండ్లు పడగా, కొన్నిచోట్ల పంప్‌హౌజ్‌లు ముంపునకు గురి అయ్యాయని తెలిపారు. వాటి పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తామ న్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని బూరుగడ్డలో నల్లచెరువు, చౌటప ల్లి, నాగులచెరువులతో పాటు కోదాడ నియోజకవర్గంలోని నారాయణపురం చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. అలాగే వరదలతో పంట నష్టపోయిన వారికి తగిన పరిహారం, ఇళ్లుకూలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ప్రాణనష్టం జరిగిన కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషి యో అందింస్తామన్నారు.