calender_icon.png 17 November, 2024 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతినెలా రూ.200 కోట్ల రుణాలు ఇవ్వాలి

17-11-2024 01:24:26 AM

ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించడంలో మహిళల భాగస్వామ్యం కీలకమని, ఈ క్రమంలో స్వయం సహాయక మహిళా సంఘాల్లో బిజినెస్ ఓరియెంటేషన్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్ అన్నారు.

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ప్రతినెలా రూ.200 కోట్ల రుణాలు మంజూరయ్యేలా జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఎంఏయూడీ కార్యాల యంలో జీహెచ్ ఎంసీ, మెప్మా అధికారులతో శనివారం దానకిశోర్ సమీక్ష నిర్వహిం చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలను వ్యాపారాల వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. అవసరమైతే బ్యాంకర్స్‌తో ప్రత్యేక వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలన్నారు.  ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు, బ్యాంక్ లింకేజీ, నిధుల పంపిణీ అంశాలను ఎంఏయూడీ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక పర్యవేక్షిస్తారని తెలిపారు. సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి, డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక పాల్గొన్నారు.