calender_icon.png 28 September, 2024 | 6:49 PM

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి రూ.10,000 కోట్ల ఐపీవో

20-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రభుత్వ రం గ విద్యుదుత్పాదక సంస్థ ఎన్టీపీసీ సబ్సిడరీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రైమరీ మార్కె ట్లోకి ప్రవేశించనుంది. రూ.10,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీ చేయ డానికి సిద్ధమయ్యింది. ఐపీవో ప్రాధమిక పత్రాల్ని తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించింది. సెబీకి సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో మొత్తం తాజా ఈక్విటీ షేర్లనే ఎన్టీపీసీ గ్రీన్ జారీచేస్తుంది. మాతృసంస్థ ఎన్టీపీసీ ఎటువంటి వాటాల్ని విక్రయించదు.

సమీకరించిన నిధుల్లో రూ.7,500 కోట్లు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి చెందిన సబ్సిడరీ ఎన్టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ రుణాల చెల్లింపునకు ఉపయోగిస్తారు. మిగిలిన నిధుల్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉద్దేశించారు. ఈ కంపెనీ సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల్ని ఏర్పా టు చేసింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో సమాచారంతో గురువారం ఎన్టీపీసీ షేరు 2.5 శాతం ర్యాలీ జరిపి రూ. 432 వద్దకు చేరింది.