calender_icon.png 28 December, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంటకు 3 కోట్ల వడ్డీ

05-11-2024 01:36:41 AM

  1. గతంలోని అప్పులకు చెల్లిస్తున్న మొత్తం
  2. గిరిజనశాఖ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 4 (విజయ క్రాం తి): గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రస్తు తం గంటకు రూ.3 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, ఎన్నో ఆర్థిక సమస్యలున్నా కాం గ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మేలు చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నా రు.

సోమవారం బంజారాహిల్స్‌లోని కు మ్రంభీం ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన గిరిజన సంక్షేమశాఖ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయడంతో 5 వేల మంది ఆశ్రమ పాఠశాలల టీచర్లకు ప్రయోజనం చేకూరిందన్నారు. 

టీచర్లు చిత్తశుద్ధితో పనిచేసి అందరిలోకెల్లా గిరి జన విద్యార్థులు ముందంజలో ఉండేలా చొరవ చూపాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యా న్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హెల్త్ మానిటరింగ్ యాప్‌ను ప్రారంభించారు.

ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బ హూకరించారు. సమావేశంలో గిరిజన సంక్షే మ శాఖ సెక్రటరి శరత్, గిరిజన గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి  పాల్గొన్నారు.