calender_icon.png 30 October, 2024 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరులో 12 కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్

30-10-2024 03:32:04 PM

రామేశ్వరం బండ, పోచారం పరిధిలో మరో రెండు సబ్ స్టేషన్లు 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

టాన్‌చెరు (విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు అందించేందుకు నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.  బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణం, పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ, పోచారం పరిధిలో నూతన సబ్స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోతలు లేని నిరంతరాయ విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కేవి సబ్ స్టేషన్, పోచారం, రామేశ్వరం బండ పరిధిలో ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు 33/11 కేవి సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో స్థలాలను కేటాయించి సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ భాస్కరరావు, ఏడి దుర్గాప్రసాద్, తహసిల్దార్ రంగారావు, రామేశ్వరం బండ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.