calender_icon.png 3 October, 2024 | 4:53 PM

1.17 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

02-10-2024 02:18:39 AM

సుల్తాన్‌బజార్‌లో ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. సుల్తాన్‌బజార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయం త్రం పోలీసులు సుల్తాన్‌బాజర్‌లో వాహన తనిఖీలు చేపడుతున్నారు.

ఈ సమయంలో అటు వైపు అనుమానాస్పదంగా వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అడ్డుకు న్నారు. వాహనాన్ని సోదా చేయగా రూ.1.17 కోట్ల నగదు పట్టుబడింది. సదరు వ్యక్తి నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు డబ్బును సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.