22-03-2025 12:00:00 AM
8,997 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి
జనగామ, మార్చి 21(విజయక్రాంతి): మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్ల 20 లక్షలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా స్టేషన్‌ఘన్‌పూర్ మహిళా సంఘాలకు చెక్కును అందించారు.
ఈ నిధులతో దాదాపు జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 8,997 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా తీసుకున్న ఋణాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల కింద రూ.16 కోట్ల 22 లక్షల 17 వేలు మంజూరయ్యాయి.
బచ్చన్నపేట మండలానికి 841 సంఘాలకు రూ.156.23 లక్షలు, చిల్పూర్ మండలానికి 763 సంఘాలకు 147.48 లక్షలు, దేవరుప్పుల మండలానికి 739 సంఘాలకు 101.08 లక్షలు, స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి రూ.856 సంఘాలకు రూ.166.78 లక్షలు, జనగామ మం డలానికి రూ.845 సంఘాలకు 180.69 లక్షలు, కొడకండ్ల మండలానికి 547 సంఘాలకు రూ.97.74 లక్షలు, లింగాల ఘన్‌పూర్ మండలానికి 882 సంఘాలకు రూ.172.11 లక్షలు, నర్మెట్ట మండలానికి 448 సంఘాలకు రూ.64.85 లక్షలు, పాలకుర్తి మం డలానికి 1026 సంఘాలకు రూ.160.48 లక్షలు, రఘునాథపల్లి మండలానికి 1050 సంఘాలకు రూ.211.16 లక్షలు, తరిగొప్పుల మండలానికి 385 సంఘాలకు 60.79 లక్షలు, జఫర్ ఘడ్ మండలానికి 615 సంఘాలకు రూ.102.80 లక్షలు కేటాయించారు.
ఈ నిధులను మహిళా సహాయక సంఘాల పొదుపు ఖాతాలకు సీఈవో ఎస్‌ఈఆర్‌పీ, తెలంగాణ ఎస్‌బీ అకౌంట్ నంబర్ 62228 879183 జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.