calender_icon.png 2 February, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణిజ్యం, పరిశ్రమలకు రూ.65,553 కోట్లు

02-02-2025 02:14:57 AM

  1. మేక్ ఇన్ ఇండియాకు మరింత ఊతం ఇచ్చేవిధంగా కేటాయింపులు 
  2. గతేడాది కంటే రూ.19వేల కోట్ల నిధులు ఎక్కువ
  3. పరిశ్రమల కోసం నేషనల్ మ్యానిఫ్యాక్చర్ మిషన్ ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో వరుసగా ఎనిమిదోసారి ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మేక్ ఇన్ ఇండియాను మరింత బలంగా ముందకు తీసుకుని వెళ్లే విధంగా వాణిజ్యం, పరిశ్రమల రంగానికి నిధులను కేటాయించారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వాణిజ్యం, పరిశ్రమల రంగానికి కేంద్రం ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో  రూ. 65,553కోట్లను కేటాయించింది. గతేడాదితో పోల్చితే ఈసారి దాదాపు రూ. 19వేల కోట్లు అధికంగా ప్రభుత్వం కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి ప్రభుత్వం రూ. 47,559కోట్లు మాత్రమే కేటాయించింది.

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలను ఒకే గొడుగు కిందకు తెచ్చే విధంగా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మిషన్ కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్రాలకు పాలసీ సపోర్ట్, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన విధి విధానాలు, గవర్నెన్స్ మరియు మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని తెలిపారు.

ఈ మిషన్ ద్వారా పర్యావరణ అనుకూల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది.  ఈ మిషన్‌లో సోలార్ పీవీ సెల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీలు, మోటార్లు, కంట్రోలర్‌లు, ఎలక్ట్రోలైసిస్, విండ్ టర్బైన్స్, హై ఓల్టేజ్ ట్రాన్స్‌మిషన్ పరికరాలు, గ్రిడ్ స్కేల్ బ్యాటరీ తయారీలో ఈ మిషన్ ద్వారా దేశీయ విలువలను పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ హార్డ్‌వేర్, టెక్స్‌టైల్స్, ఏసీసీ బ్యాటరీలతో సహా ఇతర కీలక రంగాలకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు భారీగానే పెరిగాయి. 

ప్రపంచస్థాయి పరిశ్రమలతో పోటీనే లక్ష్యం

మొబైల్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వంటి 14 ప్రాధాన్యతా రంగాల్లో ఉత్పాదకత వృద్ధిని పెంపొందించడానికి నిబద్ధతతో పని చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా ప్రభుత్వం గతంలో పారంభించిన ప్రొడక్టిక్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్(పీఎల్‌ఐ) పథకం పెట్టుబడులను ఆకర్షించడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, భారతీయ కంపెనీలు ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడటమే లక్ష్యంగా పని చేస్తుంది.