calender_icon.png 8 January, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షీష్‌మహల్ మరమ్మతులకు రూ.33 కోట్లు

07-01-2025 01:03:33 AM

* ఢిల్లీ ఎన్నికల వేళ నిప్పు రాజేస్తున్న కాగ్ నివేదిక

న్యూఢిల్లీ, జనవరి 6: అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్న టైమ్‌లో ఆయన అధికార నివాసమైన షీష్ మహల్ మరమ్మతుల కోసం చేసిన ఖర్చుపై కాగ్ రూపొందించిన నివేదిక లీకైంది. దీంతో బీజేపీ నేతలు అధికార ఆప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాగ్ నివేదిక ఢిల్లీ పాలిటిక్స్‌ని వేడెక్కిస్తోంది.

అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో  ఢిల్లీలోని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాలో ఉన్నా రు. 2020లో ఆ భవనానికి మరమ్మతులు చేయించేందుకు రూ.7.91 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ తర్వాత రూ.8. 62 కోట్లకు కాంట్రక్టర్‌కు అప్పగించా రు. కాగా 2022 నాటికి బంగ్లా మరమ్మతుల ఖర్చు రూ.33.36 కోట్లు కాగ్ అంచనా వేసింది.

2020లో సీఎం నివాసంలో కొనుగోలు చేసిన వస్తువులకు కూడా భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొంది. 88 అంగుళాల టీవీ కోసం ఏకంగా రూ.28.9 లక్షలు ఖర్చు చేశారని నివేదిక స్పష్టం చేసింది.