ఖమ్మం, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జేఎన్టీయూ నూతన భవన నిర్మాణాకి రాష్ట్రప్రభుత్వం రూ.108.60 కోట్లు విడుదల చేసిం ది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంక టేశం ఉత్తర్వులు జారీ చేశారు. మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని ప్రభుత్వంతో నిధులు ఇప్పించారు. ఇంజినీరింగ్ విద్యార్థుల కలను సాకారం చేస్తూ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంపై పాలేరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.