calender_icon.png 30 January, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు రూ.16,300కోట్లు!

30-01-2025 01:32:12 AM

కేంద్ర క్యాబినెట్ వివరాలు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, జనవరి 29: కేంద్ర క్యాబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలకు ఆమో దం తెలిపింది. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీ(ఎన్‌సీఎంఎం)కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.16,300 కోట్లు కేటాయించారు. 24 విలువైన, అరుదై న ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సా హం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ అధ్య క్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ నిర్ణయాలను కేంద్ర మంత్రి మీ డియాకు వెల్లడించారు.

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌లో 24 ఖని జాలలో కోబా ల్ట్, బెరిల్,  కాడ్మియం, లిథియం, గ్రాఫైట్, నికెల్, సెలీనియం వంటి వి ఉన్నాయన్నారు. కీలకమైన ఖనిజాలు ఎలక్ట్రానిక్స్, టెలికమూనికేషన్స్, రవాణా మొదలైన ఇతర పరిశ్ర మలకు కూడా ముఖ్యమైనవని.. రక్షణ, ఏరోస్పేస్, వ్యవసాయ రంగాలకు కూడా కీలకమై నవని ఆయన తెలిపారు.

అలాగే సీ హెచ్‌వీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటర్‌కు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పా రు. బీ హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరకు రసం, చక్కెర, చక్కెర సిరప్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదన్నారు.

పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యానికి అనుగుణంగానే ఈ ని ర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నిర్ణయంతో చక్కెర, ఇథనాల్‌కు సంబంధించిన కంపెనీల షేర్లు వృద్ధి చెందడం గమనార్హం.