calender_icon.png 23 October, 2024 | 3:51 AM

చెరువుల్లో 2.27 కోట్ల చేప పిల్లలు

07-10-2024 12:00:00 AM

నిజామాబాద్ జిల్లాలో వదలనున్న మత్స్యశాఖ

నిజామాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 967 చెరువులు ఉండగా 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 24 వేల మంది సభ్యులు ఉన్నారు. వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం తరఫున 2.27 కోట్ల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు సోమవారం నుంచి చెరువుల్లో వదలనున్నారు.

2024 ఆర్థిక సంవత్సరానికి 2.27 కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వదలడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. చెరువుల్లో చేప పిల్లలను వదిలే సమయంలో మత్స్యకార సంఘాల సభ్యులు వాటి పరిమాణం, నాణ్యతను పరిశీలించుకోవాలని కలెక్టర్ తెలిపారు. తేడా ఉంటే జిల్లా మత్స్యశాఖ అధికారికి గాని, కలెక్టర్ కార్యాలయానికి గాని ఫిర్యాదు చేయాలని సూచించారు.