calender_icon.png 22 January, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

837 కోట్లు ఫైన్ కట్టండి

20-09-2024 01:52:18 AM

నౌక ప్రమాదంలో యాజమాన్యంపై దావా

వాషింగ్టన్, సెప్టెంబర్ 19: యూ ఎస్‌ఏలోని బాల్టిమోర్‌లో ఈ ఏడాది మార్చిలో నౌక ఢీకొన్న ఘటనలో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌స్కా ట్‌కీ వంతెన కూలింది. ఈ ఘటనపై అమెరికా న్యాయశాఖ దావా వేసిం ది. ప్రమాదానికి కారణమైన ఓడ సింగపూర్‌కు చెందింది కాగా ఆ షిప్ యాజమాన్యం రూ.837 కోట్లు చెల్లి ంచాలని దావాలో పేర్కొంది. “బాల్టిమోర్‌లో వంతెనకు జరిగిన నష్టం, నౌకాశ్రయాన్ని తిరిగి తెరిచేందుకు అయిన ఖర్చులకు ఘటనకు కారణమైన సంస్థల నుంచి పొందేలా న్యా యశాఖ ప్రయత్నిస్తోంది. ఇందు లో భాగంగా ఈ దావా వేశాం. ఈ ఘటనకు సంస్థల నిర్లక్ష్యమే కార ణం” అని అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాం డ్ ఓ ప్రకటనలో తెలిపారు. సింగపూర్‌కు చెందిన గ్రేస్ ఓషన్ ప్రై వేట్, సినర్జీ మెరైన్ ప్రైవేట్ సంస్థలపై ఈ దావా పడింది. నష్ట పరిహారాన్ని 44 మిలియన్  డాలర్లకు తగ్గించాలని సదరు సంస్థలు కోరుతున్నాయి.