ఎంపీ మల్లురవి
వనపర్తి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గం పరిధిలోనిప్రతి మండల కేంద్రంలో రూ. 600 కోట్లతో ఎడ్యుకేషనల్ హబ్‌ల నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ఎంపీ మల్లురవి సందర్శించారు. ఈ సందర్భ ంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి అల్పహారా న్ని చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టపరుస్తున్నామనానరు.