calender_icon.png 16 November, 2024 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.900 కోట్ల డ్రగ్స్ సీజ్

16-11-2024 01:13:07 AM

  1. గుజరాత్‌లో పట్టుబడ్డ 700 కేజీల మత్తుపదార్థం
  2. అధికారులకు అమిత్ షా అభినందనలు 

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఢిల్లీలో శుక్రవారం నార్కోటిక్ కంట్రోల్ బ్యూ రోఅధికారులు 82 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ఢిల్లీ నాంగ్లోయ్, జనక్‌పురి ప్రాంతంలోని కొరియర్ సర్వీస్ ద్వారా డ్రగ్స్‌ను ఆస్ట్రేలియాకు పంపించేందుకు ప్రయత్నిస్తు ండగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.900 కోట్లు ఉంటుందని తెలిపారు. మరోవైపు గుజరాత్ ఏటీఎస్ తో కలిసి ఎన్సీబీ అధికారులు గుజరాత్ తీరంలో 700 కేజీల మెథాంఫె టమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 8 మంది ఇరాన్ దేశస్థులు అరెస్ట్ అయ్యారు. ఒకే రోజు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్న ఎన్సీబీనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. డ్రగ్స్ అక్ర మ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.