calender_icon.png 23 September, 2024 | 7:53 AM

సీఎం సహాయనిధికి 15 కోట్ల విరాళం

06-09-2024 01:17:26 AM

పవర్ ఎంప్లాయీస్  జేఏసీ

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి అండగా నిలిచేందుకు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్  జేఏసీ ముందుకొచ్చింది. తెలంగాణ పవర్ యుటిలిటీస్‌లోని ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిసన్స్, పెన్షనర్లు తమ ఒక రోజు మూల వేతనం రూ. 15 కోట్లను సీఎం సహాయనిధికి విరాళం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను గురువారం ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్,  టాన్స్‌కో, జెన్‌కో ఎండీ ముషారఫ్ అలీ, వరుణ్‌రెడ్డి సమక్షంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, తులసీదాస్, సదానందం, అనిల్‌కుమార్, ఎంఏ వజీర్, శ్యామ్, కుమారస్వామి, సుధాకర్‌రెడ్డి, తులసీ నాగరాణి, కరుణాకర్‌రెడ్డి, రంజీ, సత్యనారాయణ, వరప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.