calender_icon.png 22 November, 2024 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ ప్రభుత్వానికి రూ.1,750కోట్ల ముడుపులు

22-11-2024 02:42:44 AM

అమెరికా అభియోగాల ప్రకారం  అదానీ సంస్థ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 2019-24 మధ్య ప్రభుత్వాధినేతలకు అదానీ సంస్థ అత్యధికంగా రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్టు ఆరోపణల్లో ఉంది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 2021 ఆగస్ట్ 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీల్లో అదానీ వ్యక్తిగతంగా ప్రభుత్వ పెద్దలను కలిసి సంభాషించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆంధ్రా విద్యుత్ పంపిణీ సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈసీఐ)తో 7 గిగా వాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణల్లో ఉంది.  జూలై 2021-ఫిబ్రవరి 202 2 మధ్య ఒడిశా, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాలు కూడా సౌర విద్యుత్తు కోసం ఒప్పం దం కుదుర్చుకున్నాయి.

లంచం విషయ ం బయటపడకుండా కోడ్ పేర్లను ఉ పయోగించినట్టు ప్రాసిక్యూటర్లు తమ అభియోగాల్లో తెలిపారు.  అ తదానీని “న్యూయెరో యునో” లేదా “ది బిగ్ మ్యాన్‌” అని పిలిచినట్టు పేర్కొన్నారు. గ్రూప్‌కు, ప్రభుత్వాధినేతల మధ్య కమ్యూనికేషన్ అంతా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ద్వారా జరిగినట్టు తెలిపారు.