calender_icon.png 29 March, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీరు అందకనే పంటలు ఎండాయి

25-03-2025 01:12:57 AM

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

 చేర్యాల, మార్చి 24 సకాలంలో సాగునీరు అందకనే పంటలు ఎండిపోయాయని, ప్రభుత్వమే బాధ్యత వహించి, పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. తపస్పల్లి రిజర్వాయర్ కు  సాగినీటిని విడుదల చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల_ జనగామ ప్రధాన రహదారిపై రాస్తారోకోను నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో తపస్పెల్లి రిజర్వాయర్ను నింపితే పంటలు ఎండిపోయేవి కావు అన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 చొప్పున ఇన్పుట్ సబ్సిడీని అందజేయాలనిఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా రిజర్వాయర్ లోకి నీటినివిడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రైతులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొంగర వెంకట్ మావో, చేర్యాల కొమురవెల్లి మండల కార్యదర్శులు బండ కింది అరుణ్, తాడూరి రవీందర్ పాల్గొన్నారు.