calender_icon.png 12 March, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వనరుల లభ్యతను బట్టి పంటలు వేయాలి

12-03-2025 12:14:55 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ మార్చి 11 (విజయ క్రాంతి) : నీటి లభ్యతను బట్టి పంటలను సాగు చేస్తే పంట దిగుబడి బాగుంటుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కోయిల్ కొండ మండలంలో పలు గ్రామాలలో ఎండిన వరి పంటలను, కేజీబీవీ పాఠశాల, నర్సరీలను  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది.  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యామా రెడ్డి, ఎం.పి.డి. ఓ హరిచంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.