16-04-2025 12:00:00 AM
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రైతు లు పండించిన జొన్న పంటను ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగో లు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోథ్ మండ ల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారం భోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా వచ్చా రు. ముందుగా కాంటలకు పూజలు నిర్వహించి, మార్కెట్‌కు పంట తీసుకొచ్చిన తొలి రైతును శాలువతో సన్మానించి స్వీట్ తినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులు జొన్నలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాల్లోనే అమ్ముకోవాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.