24-03-2025 01:23:11 AM
దండేపల్లి, మార్చి 23 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంట లకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు.
ఆదివారం దండేపల్లి మండలం కోర్విచెల్మ గ్రామంలో నేలకు ఒరిగి తీవ్ర నష్టం వాటిల్లిన మొక్క జొన్న పంటను మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వలన జిల్లా వ్యాప్తంగా పంట లు నష్టం జరిగి మూడు రోజులవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్ట పరిహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.
ఎంత మేర నష్టం జరిగిందో కూడా ప్రభుత్వం సర్వే చేయడం లేదన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే రైతుల పక్షాన పరిహారం అందే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపతి రాజయ్య, ముఖేష్ గౌడ్, బోడకుంటి వెంకటేష్, పత్తిపాక సంతోష్, కొండ నరేష్, బత్తుల శేఖర్, అప్పని తిరుపతి, మల్యాల రమేష్, గడికొప్పుల సురేందర్, దుమ్మని సత్తయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.