హైదరాబాద్ జంటనగరాలలో మురుగునీటి కాసారాలుగా మారిన పలు చెరువుల నీళ్లతో పంటలు పండించి వాటిని మార్కెట్లోకి తరలించి, అమ్ముకోవడం భరింపరాని దారుణమైన విషయం. ఇటువంటి చర్యలను తక్షణం నిలుపుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం అభినందనీయం. కూరగాయలు ఏవి, ఎక్కడ, ఏ రకమైన నీటితో పండించారో తెలుసుకోవడం ఎవరికైనా చాలా కష్టం. ప్రజల అవసరాలను, మార్కెట్ డిమాండ్‌లను ఆసరాగా చేసుకొని కొందరు రైతులు, మరికొందరు వ్యాపారస్తులు ఈ రకమైన అకృత్యానికి పాల్పడటం నిజంగా క్షమించరాని నేరం. జనం ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాట మాడే ఇలాంటి వారిపై నిఘా పెట్టి, పట్టుకొని తగిన విధంగా శిక్షించాలి. అప్పుడే ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండగలవు.
కె.వెంకట్రావ్, నాగోల్, హైదరాబాద్