calender_icon.png 3 March, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు

03-03-2025 01:54:50 AM

  1. ఆందోళనకు దిగుతున్న రైతులు 
  2. సాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులది బాధ్యత 
  3. అలసత్వాన్ని ప్రదర్శించే అధికారులపై వేటు తప్పదు 
  4. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరిక

నిజామాబాద్ మార్చ్ 2: (విజయ క్రాంతి): ఎండు ముఖం పడుతున్న పంటలను చూసి తట్టుకోలేని రైతులు గ్రామానికి వచ్చిన ఇరిగేషన్ అధికారులను నిర్బంధించి సాగు నీరు తక్షణమే అందించాలని లేనట్లయితే ఆందోళ గాన తీవ్రతరం చేస్తామని అధికారులను హెచ్చరించారు.

బోధన్ డివిజన్ లోని నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న సాలు రా మండలంలోని పలు గ్రామాల శివారులో వేసిన పంట పొలాలు సాగునీరు అందక ఎండు ముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఆవేదనకు చెందారు. 

ఎన్నో ప్రయాసల కు ఓర్చి సాగు చేస్తే  సాగునీరు ఇందాక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం  చేస్తూ తమ గ్రామానికి వచ్చిన ఇరిగేషన్ అధికారులను శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తలుపులకు గడియ వేశారు విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరిగేషన్ అధికారులు రైతులతో మాట్లాడి శాంతింపజేశారు.

అధికారుల దృష్టికి తెచ్చి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు సద్దుమణి గారు డి28 కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కాలువల నిర్వహణకు మరమ్మత్తులు చేసి మెరుగుపరచాలని రైతులు డిమాండ్ చేశారు. పంటకు సరిపడే తాగునీరు విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతను చేస్తామని రైతులు ఇరిగేషన్ అధికారులని హెచ్చరించారు. అధిక సంఖ్యలో గ్రామ రైతులు అధికారులతో సాగునీటి విషయమై ఆందోళనకు దిగారు.