calender_icon.png 2 February, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట నమోదు సమగ్రంగా ఉండాలి

01-02-2025 11:04:37 PM

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య..

డిజిటల్ క్రాఫ్ట్ బుకింగ్ విధానాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు..

ఖమ్మం (విజయక్రాంతి): పంట నమోదు సమగ్రంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అన్నారు. రఘునాధపాలెం మండలం వి వెంకటాయపాలెం క్లస్టర్ గణేశ్వరం గ్రామంలో శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య డిజిటల్ క్రాఫ్ట్ బుకింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామస్థాయిలో, క్లస్టర్ స్థాయిలో పంటల నమోదు సమగ్రంగా ఉండాలని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రైతులు పండించిన పంటలు విక్రయాలకు ఈ పంట నమోదు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్ క్రాప్ నమోదు ఎలా నమోదు చేస్తుందన్నది పరిశీలించారు. అనంతరం రైతులు సాగు చేసిన పెసర, మొక్కజొన్న పంటలను ఆయన ఏఈఓ శిరిణ్మయితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. మొక్కజొన్నపై కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో టెక్నికల్ పవన్, ప్రత్యూష, ఏఈవో శిరిణ్మయి, రైతులు పాల్గొన్నారు.