calender_icon.png 28 September, 2024 | 9:02 PM

జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం

05-09-2024 07:41:02 PM

జిల్లా వ్యాప్తంగా 27,705 ఎకరాల్లో పంట నష్టం

జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీధర్ రెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): జిల్లాలో ఐదు రోజులుగా కురిసిన వర్షం కారణంగా అన్నదాతలకు నష్టాన్ని మిగిల్చిందని, వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. వ్యవసాయ అధికారి పరిశీలన నిమిత్తం తుంగతుర్తికి విచ్చేసిన సందర్భంగా మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ... వేల ఏకర్రాల్లో పంట నీట మునిగిందని, జిల్లావ్యాప్తంగా 10,806 మంది రైతులకు గాను 27,705 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. మెట్ట ప్రాంతాలైన సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పత్తికి వరికి మేలు చేకూర్చగా పెసర పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పంట నష్టం ఎక్కువగా ఉందని పూత దశలో ఉన్న పత్తికి, పిలక దశలో ఉన్న వరికి నష్టం పోయిందని తెలిపారు.

ఈసారి మంచి ఫలితాలు ఇస్తుందనుకున్నటువంటి పెసర చేతికందే దశలో వర్షం వల్ల మొలకలు వచ్చి నష్టాన్ని మిగిల్చిందని పూర్తిగా పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నారు వరి 18,217 ఎకరాల్లో పత్తి 3015 ఎకరాల్లో మిర్చి 460 ఎకరాల్లో పెసర 1024 ఎకరాల్లో మిర్చి 460 ఎకరాల్లో కంది 38 ఎకరాల్లో మిగతావి 4809 ఎకరాల్లో నష్టం జరిగిందని ఇసుక మేట వేసిన 11,450 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. జరిగే నష్టాన్ని వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి నాలుగైదు రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పంట పూర్తిగా నష్టపోయిన వారికి ఎకరాకు పదివేల చొప్పున ఇసుక మేట వేయబడిన పొలానికి ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ బాలకృష్ణ, వ్యవసాయ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.