calender_icon.png 28 October, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1,100 ఎకరాల్లో పంట నష్టం

03-09-2024 12:32:49 AM

వికారాబాద్ జిల్లా రైతుల దిగాలు

వికారాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లాలో సుమారు 1,100 ఎకరాల్లోని పంట నీట మునిగింది. సోమవారం వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొడంగల్, వికారాబాద్, నవాబుపేట్, దౌల్తాబాద్, ధారూరు మండలాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది పంటలు నీటమునిగాయి.

ఈ ప్రాంతాల్లో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. పొలా ల్లో నిలిచిన వర్షం బయటకు వెళితే తప్ప పంట నష్టం అంచనాపై పూర్తిస్థాయి నివేదిక వచ్చే అవకాశం ఉన్నది. వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో జూన్ నుంచి సెప్టెంబర్ నేలాఖరులోపు 477.6 మి.మీ సాధాదారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా. సోమవారం ఉదయం 10 గంటల నాటికి 687.1 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 799.8 మి.మీ కాగా,  ఇప్పటికే 687.1 వర్షపాతం నమోదైంది. 

నిండిన ప్రాజెక్టులు..

వర్షాల కారణంగా కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, జుంటుపల్లి, లకాంనపూర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. అవి జలకళను సంతరించుకున్నాయి. కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 24 అడుగుల కాగా, ఆదివారానికే ప్రాజెక్ట్ పూర్తిగా నిండింది. సర్న్‌పల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 18 అడుగులు కాగా, పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. లక్నాపూర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా, పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతున్నది.