16-04-2025 02:38:26 PM
కల్లూరు, ఏప్రిల్ 16(విజయ క్రాంతి): మండలం లో వరి ధాన్యం, మామడి, మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అకాల వర్షాలు. ఏప్రిల్ నెల మొదలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు దపాలు గా అకాల వర్షాలు కురవడం జరిగింది ఈ వర్షాల వలన రైతు అష్ట కష్టాలు కొని తెచ్చుకున్న వైనం గా ఉంది రైతులు పరిస్థి చుస్తే ఆరు గాలా లు కస్టపడి పండించిన పంటలు చేతికి వచ్చి అమ్ముకుని నాలుగు రూపాయలు కళ్ల చూసే సమయానికి ఈ అకాల వర్షాలు వల్ల రైతులు గొంతుకు మింగుడు పడని పరిస్థితులు ఏర్పాటు అయ్యాయి.
పుల్లయ్య బజర్, లింగాల చెన్నూరు, వెన్నవల్లి, పెద్దకోరుకోండి,పరిస్థితులు ఒక విధంగా ఉంటే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు పరిస్థితులు ఇంకా దారుణం గా తయారు అయ్యాయి ఉదాహరణ కీ పేరువంచ రెవిన్యూ విష్యం గమనించినట్లు ఐతే ప్రస్తుతం బుధవారం వరకు 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే కోతలు అయ్యి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాగ మిగతా 30నుంచి 40 శాతం కోతలు కాకా పొలాల లో పంట కోత దశ లోనే ఉంది ప్రస్తుతం కురిసిన వర్షలకు వరి కొత మిషన్ దళారులు దే రాజ్యం నడుస్తుంది వారు ఎంత అంటే అంత ఇవ్వాలిసిందే టైర్ కోత మిషన్ తో 30నిముషాలు కోసే వరిపోలం ట్రాక్ మిషన్ ద్వారా 50నిముషాలు లేదా గంట టైం పడుతుంది ఈ విధంగా రైతులు వరి కోత మిషన్ లకి వేల కు వేలు పెట్టి కోత కోపించి కొనుగోలు యార్డ్ లకు తరీలిస్తే అక్కడ కుప్పలు పోయడానికి కూడా కాళీ ప్రదేశం లేక రైతులు లబో దిబో అంటున్న పరిస్థితి ఎదురు అవుతుంది.
ఇది ఇలా ఉంటే ధాన్యం ఆరబెట్టి శాతం చూపిస్తే పచ్చి ఉంది ఇంకో రెండు రోజులు ఆరాధిప్పలి అని ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది చెపుతారు సరే అని అదనంగా భరకాలు అద్దెకు తెచ్చి ఆరోబోస్తే ఈలోపల అకాల వర్షాలు మళ్ళీ దాన్యం తడిసి శాతం మొదటికి వస్తుంది ఇంకా రైతులు ఏమి చెయ్యాలి పచ్చి వడ్లు వేసిన రైతు కాలర్ వెనక్కి వేసుకొని చెట్లు కింద ముచ్చట్లు పెడుతుంటే కొనుగోలు కేంద్రం లో పోసిన రైతులు పగలు ఎండకు ఆరాధిప్పుడు రాత్రి వానకి తడిసి ముద్ద అవుడు ఇదే రైతు రాజు అంటే దేశానికి వెన్నుముక అంటే ఇదేనా అని రైతు కళ్ళల్లో కన్నీరు పెడుతున్నారు.అధికారులు స్పందించి మిల్లర్ల ను అధికంగా మాట్లాడి, కాటా అమాలి ల ను అధికంగా రప్పించి గన్ని సంచులు లోటు లేకుండా చూసి రైతులు వద్ద రాజకీయం చెయ్యకుండా ప్రతి గింజా కొనుగోలు చేసే లా మాజురి తరుగు లాంటివి రైతు ధాన్యం లో కటింగ్ పెట్టకుండా రైతులు ని ఏదోకోవాలా అని పేరువంచ రైతులు కోరుకుంటున్నారు.