calender_icon.png 31 October, 2024 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

15-07-2024 03:47:11 PM

హైదరాబాద్: పంటల రుణమాఫీ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ కానుంది. రైతు కుటుంబానికి గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం చేసింది. అందుకోసం వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. పంట రుణమాఫీ నేరుగా లబ్ధిదారుల రుణఖాతాలకు జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది. తెలంగాణలోని అన్ని షెడ్యూల్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ కానున్నాయి. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.