calender_icon.png 27 March, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటల బీమాను పటిష్టంగా అమలు చేయాలి

24-03-2025 12:00:00 AM

రైతు విభాగం ఆవిర్భావ సమావేశంలో యుగంధర్ గౌడ్

ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాం తి):  పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, రైతుల ఆత్మహత్యలు పూర్తిగా నివారించాలని కోరారు. ఈ మేరకు  ఆదివా రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ పొలిటికల్ జెఎసి రైతు విభాగం ఆవిర్భావ సమావేశం ఏర్పాటు చేశారు.

రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ గా మక్తల్ నియోజకవర్గానికి చెందిన మారమోని పాండురంగ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ పం టల బీమాను పటిష్టంగా అమలు చేసి, అకా ల వర్షాల వలన నష్టపోయిన రైతులకు రైతు పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నా రు. జిల్లాల వారీగా నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కోరారు.

రైతు లు పండించిన పంటకు తామే రేటు నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని, అప్పు డే రైతులకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు. నూతన కన్వీనర్ పాండురంగ యాద వ్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు గూడుషా, తిరుపతయ్య, శివన్న, నాగన్న, కుమ్మరి తిరుపతయ్య, వెంకటయ్య, రాజు, తిరుమలేశ్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.