21-04-2025 02:01:49 AM
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఏది చేసినా ఇట్టే దొరికిపోవడం బీఆర్‌ఎస్ ట్యాలెంట్ అని తెలంగాణ బీజేపీ ఎద్దేవా చేసింది.
హెచ్‌సీయూ భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రా ణుల అటవీ ప్రాంతం కోసం నెత్తినోరు కొట్టుకున్నామంటూ మొసలి కన్నీరు కార్చిన బీఆర్‌ఎస్ నేతలు.. తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం పచ్చని పంటలకు సాగునీరందించే కాల్వలను ధ్వంసం చేశారని బీజేపీ తెలంగాణ ఎక్స్ హ్యాండిల్‌లో విమర్శిస్తూ పోస్ట్ చేశారు.
ఈ సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం వాగులు, వంకలను పూడ్చివేశారని.. ఇది బీఆర్‌ఎస్ పార్టీ నిజస్వరూపమని ఆరోపించారు. వన్యప్రాణులను చూస్తే గుండె కరిగిందంటూ దొంగ నాటకాలాడిన బీఆర్‌ఎస్, ఇప్పుడు అన్నదాతల కడుపు కొడు తోందని ఎక్స్ వేదికగా ఆరోపించింది.