calender_icon.png 14 March, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలి

13-03-2025 12:59:59 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

పెబ్బేరు, మార్చి 12: రైతులు సాగుచేస్తున్న పంటలకు సంబందించిన వివరాలను క్రాప్ బుకింగ్ సర్వే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలంలోని కంచిరావు పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు చేపడుతున్న పంటల వివరాల క్రాప్ బుకింగ్ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు.

పంటల సాగు వివరాల నమోదులో తప్పులు, పైర్లకు సోకుతున్న తెగుళ్లను సకాలంలో గుర్తించలేకపోవడం, పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు క్రాప్ బుకింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను పక్కాగా క్రాప్ బుకింగ్ సర్వేలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ ఉన్న పాఠశాలలో నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు, తహసీల్దార్ తదితరులు ఉన్నారు.