సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయుసీని కొన్ని సంఘాలు పనిగట్టుకొని విమర్శిస్తున్నాయని చౌకబారు విమర్శలు మానుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య హితవు పలికారు. సోమవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల కొత్తగూడెంలో జరిగిన స్ట్రక్చర్డ్ సమావేశంలో డైరెక్టర్ ఆధ్వర్యంలో కొన్ని సమస్యలపై అవగాహన కుదిరిందని అందులో మైనింగ్ స్టాప్ సిబ్బంది అనారోగ్య రీత్యా మెడికల్ అన్ పిట్ అయితే గతంలో సూటబుల్ ఉద్యోగం ఇవ్వకుండా జనరల్ మజ్దూర్ గా ఇచ్చేవారని పది సంవత్సరాల నుండి వీరి సమస్యలపై అనేక ఉద్యమాలు చేసినప్పటికీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేస్ యూనియన్ గుర్తింపు సంఘం ఉన్న సమయంలో ఏనాడు కూడా పోరాటం చేయని సీఐటియు, హెచ్ఎమ్ఎస్ యూనియన్లు, ఏఐటియుసిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సంఘాలు కార్మికుల్లో మనగడ కోల్పోయామనే అక్కసుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు, ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని కార్మికుల మన్ననలు పొందాలని సూచించారు. స్ట్రక్చర్డ్ సమావేశంలో మైనింగ్ స్టాఫ్ కు సర్ఫేస్ లో సూటబుల్ ఉద్యోగం, జెఎంఈటిలు కొంతమంది డ్యూటీలు చేయలేక డిస్మిస్ అయినవారికి వన్ టైం మేజర్ గా మళ్లీ అదే ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఒప్పందం జరిగిందన్నారు. ట్రేడ్స్ మెన్ లకు డిసెంబర్ నెలలో జరిగే సీఅండ్ఎండి స్ట్రక్చర్డ్ సమావేశంలో అనారోగ్య రిత్య మెడికల్ అన్ ఫిట్ అయితే సూటబుల్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు.
రానున్న సమావేశాల్లో పేర్క్స్ పై ఇన్కంటాక్స్, సొంత ఇంటి కల సాకారం తదితర డిమాండ్లపై సిఅండ్ఎండీ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంతో, యాజమాన్యంతో ఒప్పించి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాదని సుదర్శన్, నాయకులు కంది శ్రీనివాస్, సోమిశెట్టి రాజేశం, పెద్దపెల్లి బానయ్య, టేకుమట్ల తిరుపతి, రాజేష్ యాదవ్, ములకలపల్లి వెంకటేశ్వర్లు, జి.సుదర్శన్ రెడ్డి, సిహెచ్ రామదాసు, ఆంటోని, దినేష్, ఎగ్గేటి రాజేశ్వరరావు, మైనింగ్ స్టాఫ్ నాయకులు నాగేశ్వరరావు పాల్గొన్నారు.