16-03-2025 12:31:39 AM
బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ప్రస్తుతం జరుగుతున్న అసెం బడ్జెట్ సెషన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి స్థానిక దిల్‌ఖుషా గెస్ట్ హౌజ్‌లో బీజేపీ ఎమ్మె ల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అమలు చేయలేకపోయిన రైతుభరో రైతు రుణమాఫీ, కౌలురైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చిన హామీలతో పాటు బోనస్ ఇవ్వడంలో వైఫ ఎండగట్టాలని సూచించారు. ప్రస్తుతం తాగు, సాగునీటిని అందించడంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీ సూచించారు.
గ్రామాల్లో తాగునీటి దుస్థితిపై కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలకు తెలిసేలా గట్టిగా వ్యవహరించాలని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, డిఫ్యూటీ ఎల్పీ నేత పాయల్ శం ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు.