calender_icon.png 12 February, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టాలి

12-02-2025 05:14:53 PM

కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగింది..

కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన సభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

భూపాలపల్లి (విజయక్రాంతి): బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా చేపట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సి వర్గీకరణ అవగాహన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి ఇతర రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ర్యాలీ జిల్లా కేంద్రంలోని సితార గ్రాండ్ హోటల్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీగా కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులతో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అన్నారు. ఎస్సీలల్లో 36 కులాలు ఉండి కూడా వర్గీకరణ జరగక ఏళ్ల తరబడి వెనకబడి పోయారని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న మేరకు హామీని నిలబెట్టుకుందని అన్నారు. కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని ఎమ్మెల్యే అన్నారు. 2014లో భారాసా సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని, ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో శాస్త్రీయంగా ప్రభుత్వ సిబ్బందిని పెట్టి ఇంటింటికి తిరిగి పరిశీలించి వివరాలు సేకరించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస - బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా కృషి చేయాలని నేతలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు గ్రామాలలో కలిసికట్టుగా పనిచేయాలని, వర్గాలుగా విడిపోయి గ్రామాలల్లో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న బీఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ అవగాహన ర్యాలీ, సభలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.