calender_icon.png 12 February, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతకానిలను విమర్శిస్తే సహించం

10-02-2025 06:12:54 PM

మందమర్రి (విజయక్రాంతి): మాల సంఘం నాయకులు నేతకాని కులస్తులను విమర్శిస్తే సహించేది లేదని నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు సునార్కర్ రాంబాబు అన్నారు. పట్టణ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాల సంఘం నాయకులు పైడిమల్ల నర్సింగ్ నేతకాని కులస్తులను విమర్శిస్తూ మాట్లాడడం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. చెన్నూరు, బెల్లంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పెద్దపెల్లి పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న నేతకానిల ఓట్లతోనే చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు పెద్దపల్లి ఎంపీలు పదవులు పొందారని ఆయన గుర్తు చేశారు.

నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, మంద కృష్ణ మాదిగలను విమర్శించడం నీ స్థాయి కాదని ఆయన హితవు పలికారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేత పట్ల అసభ్యంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. నేతకానిలు అవగాహన లేనివారు అనడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పైడిమల్ల నర్సింగ్ పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు, మహిళా నాయకులు గోలేటి లక్ష్మీ, నాయకులు అనపర్తి యువరాజ్, దుర్గం సంతోష్, దుర్గం రాజయ్యలు పాల్గొన్నారు.